Prakasam: సంతనూతలపాడులో హోరెత్తిన వైఎస్సార్‌సీపీ పోరుబాట!
Prakasam: సంతనూతలపాడు MRO ఆఫీస్ వద్ద డీఎస్సీ అక్రమాలు, నిరుద్యోగ సమస్యలపై మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఆధ్వర్యంలో YSRCP రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి.
Prakasam: సంతనూతలపాడులో హోరెత్తిన వైఎస్సార్‌సీపీ పోరుబాట!
Prakasam: డీఎస్సీ అక్రమాలపై, విద్యార్థులు నిరుద్యోగుల సమస్యలపై, యువజన విభాగం - విద్యార్థి విభాగం సారథ్యంలో, స్థానిక MRO కార్యాలయం ఎదురు రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు.సంతనూతలపాడు నియోజకవర్గ కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు దుంపా చెంచి రెడ్డి ఆధ్వర్యంలో డీఎస్సీ అక్రమాలపై, విద్యార్థులు నిరుద్యోగుల సమస్యలపై, యువజన విభాగం - విద్యార్థి విభాగం సారథ్యంలో, స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ఎదురుగా జరుగుతున్న, మొదటి రోజున రిలే నిరాహర దీక్షల కార్యక్రమంలో ముఖ్య అతిధిగా హాజరై దీక్షా శిబిరాన్ని ప్రారంభించిన మాజీ మంత్రివర్యులు, సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్త బాపట్ల జిల్లా వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ డాక్టర్ మేరుగు నాగార్జున.
ఈ కార్యక్రమంలో యువజన - విద్యార్థి విభాగం నాయకులు పల్లపాటి అన్వేష్, దుంపా ఇంద్రసేనారెడ్డి, గంగవరపు రుషి, sk. నాగూర్, దుంపా అజయ్ రెడ్డి, సాయి సంతనూతలపాడు గ్రామ కమిటీ అధ్యక్షులు దుంపా ఎలమందరెడ్డి, జడ్పిటిసి దుంపా రమణమ్మ, ఎంపీపీ బుడుంగుంట విజయ, రాష్ట్ర పార్టీ సంయుక్త కార్యదర్శి వేమా శ్రీనివాసరావు, మద్దిపాడు ఎంపీపీ వాకా అరుణ కోటిరెడ్డి, రాష్ట్ర SC సెల్ కార్యదర్శి కందుల డేని, జాయింట్ సెక్రటరీ దుడ్డు వినోద్ కుమార్, రాష్ట్ర ప్రచార కమిటీ సెక్రటరీ బొమ్మల రామాంజనేయులు, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి సన్నపరెడ్డి రమణమ్మ, మరియు డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు యువకులు, వైఎస్ఆర్సిపి నాయకులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




