Peddadoornala: మద్యం తాగి బండి నడిపితే జైలుకే ఎస్సై సీరియస్ వార్నింగ్!
Peddadoornala: పెద్దదోర్నాలలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై వెంకటరమణయ్య హెచ్చరించారు.
Peddadoornala: మద్యం తాగి బండి నడిపితే జైలుకే ఎస్సై సీరియస్ వార్నింగ్!
పెద్దదోర్నాల: మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పెద్దదోర్నాల ఎస్సై వెంకటరమణయ్య హెచ్చరించారు.
ఇటీవల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన ఒక వ్యక్తిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు.
రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల ప్రాణాల రక్షణ కోసం పోలీసులు నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని, అలాంటి చర్యలు తమతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు కలిగిస్తాయని అన్నారు.
అందువల్ల వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం సేవించిన తర్వాత వాహనాలు నడపవద్దని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై వెంకటరమణయ్య స్పష్టం చేశారు.




