Singarayakonda: ఇంజక్షన్ వికటించే ప్రాణం పోయిందా? సింగరాయకొండలో కలకలం
Singarayakonda: ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని ప్రగతి నర్సింగ్ హోమ్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Singarayakonda: ఇంజక్షన్ వికటించే ప్రాణం పోయిందా? సింగరాయకొండలో కలకలం
Singarayakonda: సింగరాయకొండలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ప్రగతి నర్సింగ్ హోమ్‌లో చికిత్స కోసం వెళ్లిన ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, తుపాకుల బుజ్జి (60) అనే వ్యక్తి షుగర్ పరీక్ష చేయించుకోవడానికి ఆసుపత్రికి వెళ్లారు.
షుగర్ టెస్ట్ అనంతరం ఆసుపత్రి సిబ్బంది ఇంజక్షన్ ఇచ్చారని, ఆ తరువాత ఆయన పరిస్థితి విషమించి మరణించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న సింగరాయకొండ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తూ,
బాధిత కుటుంబ సభ్యులు మరియు ఆసుపత్రి సిబ్బంది నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మృతికి గల అసలు కారణాలు పోస్టుమార్టం నివేదిక మరియు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
Next Story




