Singarayakonda: కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకోం: చెవిరెడ్డి!

Singarayakonda: సింగరాయకొండలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడారు. కూటమి నాయకుల అరాచకాలను ఎండగడుతూ, కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

Ram Mohan, Singarayakonda
Published on: 28 Oct 2026 5:05 PM IST
Singarayakonda
X

Singarayakonda: కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకోం: చెవిరెడ్డి!

Singarayakonda: నామినేషన్ సమయంలో కూటమి నాయకుల అరాచకాలపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు..నామినేషన్ల సమయంలో కూటమి నాయకులు.. వైసీపీ నాయకులపై, కార్యకర్తలపై దాడులకు తెగబడి నామినేషన్ కాగితలను చించివేసి కొత్త సంస్కృతిని పరిచయం చేశారనీ.. ఇదే సంస్కృతి తో ముందుకు పోవాలనుకునే కూటమి నాయకులకు ఇదే హెచ్చరిక..

మానాయకుడు చొక్కా మడత పెట్టేవరకు తెచ్చుకోవద్దని..మరో రెండు సంవత్సరాల్లో మళ్లీ అధికారంలోకి వస్తాంమని.. అప్పుడు నేడు వైసీపీ నాయకులపై దాడులకు తెగబడ్డ ప్రతి ఒక్కరూ గ్రామం వదిలి వెళ్ళవలసిందేనని..ఎవరిని వదిలేది లేదనీ..

పోరాటాల పురిగడ్డ వైఎస్సార్ సీపీ.. పోరాటాలతో పైకొచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని..మనాయకులపై దాడి చేసిన ప్రతి కూటమి నాయకులను డిజిటల్ బుక్ లోనే కాదు మైండు లో ఉంచుకుంటాం ఎవరిని వదలం..ఊరి నుండి తరిమికొడతం అని చెవిరెడ్డి హెచ్చరించారు... సింగరాయకొండ లోని వైఎస్ఆర్సిపి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం లో భాగంగా సింగరాయకొండ లో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెవిరెడ్డి హార్డ్ కామెంట్స్ చేశారు..

Ram Mohan, Singarayakonda

Ram Mohan, Singarayakonda