Singarayakonda: సింగరాయకొండ గర్ల్స్ హైస్కూల్‌కు త్రిబుల్ ఐటీ సీట్ల పంట

Singarayakonda: ప్రకాశం జిల్లా సింగరాయకొండ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు త్రిబుల్ ఐటీలో సీట్లు సాధించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 13 Jun 2026 6:06 PM IST
Singarayakonda
X

Singarayakonda: సింగరాయకొండ గర్ల్స్ హైస్కూల్‌కు త్రిబుల్ ఐటీ సీట్ల పంట

Singarayakonda: శనివారం నాడు ప్రకటించిన త్రిబుల్ ఐటీ ఫలితాలలో సింగరాయకొండ మండలం సింగరాయకొండ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు ముగ్గురు రాజీవ్ గాంధీ ట్రిపుల్ ఐటీ లలో సీట్లు సాధించారు.

పాఠశాలకు చెందిన బీగాల నాగ జ్యోత్స్న నూజివీడు క్యాంపస్ లోను, పొట్టేళ్ల రేవతి ఇడుపులపాయ క్యాంపస్ లోను, పాకల అనూష శ్రీ ఒంగోలు క్యాంపస్ లోను సీట్లు సాధించారు.

ఈ ఘనత సాధించి పాఠశాలకు గొప్ప పేరు తెచ్చినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయిని శ్రీమతి కే మహాలక్ష్మి గారు అలాగే మిగిలిన సిబ్బంది విద్యార్థినులను ఒక ప్రకటనలో అభినందించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివినందువల్ల వీరికి త్రిబుల్ ఐటీల్లో సీట్లు రావడం జరిగిందని వీరు అక్కడ ఇంటర్మీడియట్ తో పాటు బీటెక్ కూడా పూర్తి చేసుకుని బయటకు వస్తారని చెప్పారు.

ఇది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద ప్రతిభ గలిగిన విద్యార్థినులకు గొప్ప అవకాశం అని తెలిపారు. కాబట్టి తల్లిదండ్రులందరూ ఆలోచించి వారి యొక్క కుమార్తెలను బాలికల ఉన్నత పాఠశాలలో చేర్చాలని పాఠశాల ప్రధానోపాధ్యాయిని శ్రీమతి కే మహాలక్ష్మి ఒక ప్రకటనలో తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story