Chirala: బ్యాడ్మింటన్ జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో ఎస్ఎంఎల్జే విద్యార్థినుల ప్రదర్శన!

Chirala: బాపట్ల జిల్లా చీరాలలో నిర్వహించిన ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఎంపిక పోటీల్లో సెయింట్ మార్క్స్ లూథరన్ కళాశాల విద్యార్థినులు ప్రతిభ కనబరిచి ఎంపికయ్యారు.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 8 Oct 2026 8:49 AM IST
Chirala
X

Chirala: బ్యాడ్మింటన్ జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో ఎస్ఎంఎల్జే విద్యార్థినుల ప్రదర్శన!

Chirala: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలోని స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన బ్యాడ్మింటన్‌ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు బుధవారం చీరాలలో ఉత్సాహంగా నిర్వహించారు.

స్థానిక డిస్ట్రిక్ట్‌ స్పోర్ట్స్‌ అథారిటీ ఇండోర్‌ స్టేడియంలో అండర్‌–14, అండర్‌–17, అండర్‌–19 బాలురు, బాలికల విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించారు.

ఈ ఎంపిక పోటీల్లో బాలికల విభాగంలో చీరాలలోని సెయింట్‌ మార్క్స్‌ లూథరన్‌ జూనియర్‌ కళాశాలకు చెందిన విద్యార్థినులు దగ్గుబాటి జ్యోతిశ్రీ, మూకిరి సురేఖ, జ్యోత్స్న, దేవరపల్లి సలోమీ ప్రతిభ కనబరిచి ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ గారపాటి పుష్పరాజు తెలిపారు.

అండర్‌–19 విభాగంలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను తదుపరి స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థినులను ప్రిన్సిపాల్‌, కళాశాల అధ్యాపకులు అభినందించారు. రానున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala