Dornala: పెద్ద దోర్నాలలో పోలీసుల ‘సండే ఆన్ సైకిల్

Dornala: ఎస్పీ హర్షవర్ధన్ ఆదేశాల మేరకు పెద్ద దోర్నాల ఎస్సై వెంకటరమణయ్య ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది శారీరక దారుఢ్యం కోసం ‘సండే ఆన్ సైకిల్’ ర్యాలీ నిర్వహించారు.

Srikanth Singam, Markapur
Published on: 12 July 2026 1:41 PM IST
Dornala
X

Dornala: పెద్ద దోర్నాలలో పోలీసుల ‘సండే ఆన్ సైకిల్

Dornala: పెద్ద దోర్నాల జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీసు సిబ్బందిలో శారీరక దృఢత్వం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో పెద్ద దోర్నాల ఎస్సై వెంకటరమణయ్య ఆధ్వర్యంలో ఆదివారం సండే ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎస్సై వెంకటరమణయ్యతో పాటు పోలీసు సిబ్బంది సైకిళ్లపై దోర్నాల మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. శారీరక దారుఢ్యం, శక్తి సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి ప్రతి ఒక్కరూ నిత్యం వ్యాయామం చేయాలని ఈ సందర్భంగా సూచించారు.

ఎస్సై వెంకటరమణయ్య మాట్లాడుతూ, పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండేందుకు మంచి ఆరోగ్యం, శారీరక దృఢత్వం ఎంతో అవసరమన్నారు. జిల్లా ఎస్పీ సూచనల మేరకు ఇటువంటి ఫిట్‌నెస్ కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పెద్ద దోర్నాల ఎస్ఐ వెంకటరమణయ్య పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur

Next Story