Singarayakonda: ఐలాపూర్ యువకుడి మృతిపై పలు కోణాల్లో విచారణ జిల్లా ఎస్పీ

Singarayakonda:

P.RAMMOHAN, AMADALAVALASA
Published on: 7 July 2026 3:49 PM IST
Singarayakonda
X

Singarayakonda: ఐలాపూర్ యువకుడి మృతిపై పలు కోణాల్లో విచారణ జిల్లా ఎస్పీ

సింగరాయకొండ: పాత సింగరాయకొండ గ్రామంలోని ఓ బావిలో మే 30వ తారీఖున అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన తెలంగాణ రాష్ట్రం ఐలాపూర్ గ్రామానికి చెందిన అంకం రాహుల్ (21) మృతి కేసులో కేసు విచారణలో భాగంగా సంఘటన స్థలానిన్నీ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించారు.

అనంతరం సింగరాయకొండ పోలీస్ స్టేషన్ కు చేరుకొని కేసు వివరాలు పరిశీలించారు.

ఎస్పీ ఈ సందర్భంగా ఎస్పి హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ ఈ కేసులో ఈనెల 1వ తారీఖున DNA రిపోర్ట్ ఆధారంగా మృతదేహం అంకం రాహుల్ దిగా నిర్ధారణ అయిందని.ఈ సమాచారాన్ని తల్లిదండ్రులకు అందించమని వారు వచ్చిన అనంతరం మృతదేహాన్ని వారికి అప్పగిస్తామని ఈ కేసులో మృతుడు సింగరాయకొండకు వచ్చి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు అనే విషయమై పలు కోణాల్లో విచారణ జరుగుతుందని విచారణ పూర్తయిన తర్వాత కేసు వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ తెలిపారు.

P.RAMMOHAN, AMADALAVALASA

P.RAMMOHAN, AMADALAVALASA

Next Story