Markapur: మార్కాపురం మున్సిపల్ ఎన్నికలకు 800 మంది పోలీసులతో భారీ భద్రత!

Markapur: మార్కాపురం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు 800 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు. ఫ్లయింగ్ స్క్వాడ్లు, చెక్‌పోస్టులు, రెండు అంచెల స్ట్రాంగ్ రూమ్ భద్రతపై జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా కీలక ఆదేశాలు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 30 Oct 2026 1:43 PM IST
Markapur
X

Markapur: మార్కాపురం మున్సిపల్ ఎన్నికలకు 800 మంది పోలీసులతో భారీ భద్రత!

Markapur: మార్కాపురం జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు సుమారు 800 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా తెలిపారు.

ఫ్లయింగ్ స్క్వాడ్స్, చెక్‌పోస్టుల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేశామని, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి స్ట్రాంగ్ రూముల వద్ద రెండు అంచెల భద్రత కల్పిస్తున్నామని వెల్లడించారు. బ్యాలెట్ బాక్సుల తరలింపు, కౌంటింగ్ సమయంలోనూ ప్రత్యేక భద్రత ఉంటుందని పేర్కొన్నారు.

సెక్షన్ 144 అమల్లో ఉన్నందున ప్రజలు గుంపులుగా చేరరాదని, ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులు ఉంటే పోలీసు అధికారులకు తెలియజేయాలని, ప్రశాంత ఎన్నికలకు ప్రజలు సహకరించాలని ఎస్పీ పంకజ్ కుమార్ కోరారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM