Markapur: ఎస్పీ కార్యాలయంలో స్పందన 60 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

Markapur: మార్కాపురం ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRSలో ఎస్పీ పంకజ్ కుమార్ మీనా 60 ఫిర్యాదులు స్వీకరించి, బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 12 Oct 2026 8:45 PM IST
Markapur
X

Markapur: ఎస్పీ కార్యాలయంలో స్పందన 60 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

మార్కాపూర్: మార్కాపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS)లో ఎస్పీ పంకజ్ కుమార్ మీనా 60 ఫిర్యాదులు స్వీకరించారు.

పెద్దారవీడు మండల రైతులకు మొక్కజొన్న పంట డబ్బులు చెల్లించలేదన్న ఫిర్యాదుపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

దోర్నాల మండలం బోడే నాయక్ తండాకు చెందిన 65 ఏళ్ల వికలాంగ వృద్ధుడు బాలాజీ నాయక్ వద్దకు స్వయంగా వెళ్లి ఫిర్యాదు స్వీకరించారు. సమస్యపై విచారణ జరిపి చట్టప్రకారం న్యాయం చేయాలని దోర్నాల ఎస్‌ఐని ఆదేశించారు.

ప్రతి ఫిర్యాదుపై నిర్ణీత గడువులోగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని అధికారులకు ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో ఓఎస్డీ నవజ్యోతి మిశ్రా ఐపీఎస్, డీఎస్పీ నిమ్మగడ్డ సత్యనారాయణ పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM