Peddaraveedu: పెద్దారవీడు మండల నూతన తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన.. సురేష్ బాబు

Peddaraveedu: పెద్దారవీడు మండల నూతన తహసీల్దార్‌గా సురేష్ బాబు బాధ్యతలు స్వీకరణ.

SREENIVAS YANNAM, MARKAPURAM
Updated on: 10 Jun 2026 1:18 PM IST
Peddaraveedu
X

Peddaraveedu: పెద్దారవీడు మండల నూతన తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన.. సురేష్ బాబు

Peddaraveedu: పెద్దారవీడు మండల నూతన తహసీల్దార్‌గా సురేష్ బాబు బుధవారం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. గతంలో కొనకనమిట్ట మండల తహసీల్దార్‌గా సమర్థవంతంగా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందిన ఆయనకు పెద్దారవీడులో ఘన స్వాగతం లభించింది.

ఇప్పటివరకు ఇన్‌చార్జి తహసీల్దార్‌గా బాధ్యతలు నిర్వహించిన రామకృష్ణ ఇకపై డిప్యూటీ తహసీల్దార్‌గా తన విధులను కొనసాగించనున్నారు. నూతన తహసీల్దార్ బాధ్యతల స్వీకార సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ రామకృష్ణ, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) సుబ్బారెడ్డి, వీఆర్వోలు, వీఆర్ఏలు కలిసి సురేష్ బాబును ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా తహసీల్దార్ సురేష్ బాబు మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా చర్యలు తీసుకుంటానని, రెవెన్యూ సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తానని తెలిపారు. ప్రజల సమస్యలను పారదర్శకంగా, వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు.

మండల ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు రెవెన్యూ సిబ్బంది సమిష్టిగా పనిచేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మండల సర్వేయర్ శ్రీనివాసరెడ్డి, గొబ్బురు విఆర్ఓ టి హరి నారాయణ పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story