Cheemakurthi: చీమకుర్తిలో "స్వచ్ఛత హీ సేవ": ఇళ్ల వద్ద దీపాలు వెలిగించి సంకల్పం
Cheemakurthi: చీమకుర్తి విద్యానగర్‌లో ‘స్వచ్ఛత హీ సేవ 2026’లో భాగంగా ప్రజలు ఇళ్లను శుభ్రం చేసుకుని దీపాలు వెలిగించి స్వచ్ఛ సంకల్పానికి శ్రీకారం చుట్టారు.
Cheemakurthi: చీమకుర్తిలో "స్వచ్ఛత హీ సేవ": ఇళ్ల వద్ద దీపాలు వెలిగించి సంకల్పం
Cheemakurthi: చీమకుర్తి మున్సిపాలిటీలో "స్వచ్ఛత హీ సేవ " 2026 కార్యక్రమంలో భాగంగా ఈరోజు విద్యా నగర్ నందు ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసుకొని దీపం వెలిగించటం ద్వారా స్వచ్ఛ జీవన విధాన సంకల్పానికి నాంది పలికారు. తద్వారా ప్రతి ఇంటిలో జాతీయ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జరిగినది.
ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ శ్రీ వై రామకృష్ణయ్య , పట్టణ టీడీపీ అధ్యక్షుడు యం చలమయ్య, మన్నం ప్రసాద్ రావు గారు,కాట్రగడ్డ రమణయ్య గారు,యడ్లపల్లి రామబ్రహ్మం గారు, కందిమళ్ల గంగాధర్ గారు, గోరంట్ల అంజినీ, బి శంకర్ గారు, జి అనిల్ గారు సానిటరీ ఇన్స్పెక్టర్ మరియు శానిటేషన్ సెక్రటరీలు మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.




