Markapuram: ఎమ్మెల్యే కందుల నేతృత్వంలో కూటమి భారీ ర్యాలీ!
Markapuram: మార్కాపురం మున్సిపల్ ఎన్నికల వేళ కూటమి టీడీపీ చైర్మన్ అభ్యర్థి వక్కలగడ్డ మల్లికార్జున్ భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు.
Markapuram: ఎమ్మెల్యే కందుల నేతృత్వంలో కూటమి భారీ ర్యాలీ!
Markapuram: మార్కాపురం మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ సందడి నెలకొంది. కూటమి తరఫున టీడీపీ చైర్మన్ అభ్యర్థి వక్కలగడ్డ మల్లికార్జున్ భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, టీడీపీ పరిశీలకులు బీటీ నాయుడు, జనసేన నాయకుడు ఇమ్మడి కాశీనాథ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు పివి కృష్ణారావు, బిజెపి రాష్ట్ర మీడియా సెల్ ప్రధాన కార్యదర్శి ఏలూరి రామచంద్రారెడ్డి , కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ బలాన్ని చాటుకున్నారు.
మున్సిపల్ చైర్మన్గా రెండోసారి పోటీ చేస్తున్న వక్కలగడ్డ మల్లికార్జున్.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో పాటు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆశీస్సులతో ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు తెలిపారు.
ప్రజలు తనపై నమ్మకం ఉంచి ఆశీర్వదిస్తే భారీ మెజార్టీతో గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేశారు. మార్కాపురం పట్టణ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని, తనకు అవకాశం కల్పిస్తే ‘వక్కలగడ్డ మార్క్ పాలన’ చూపిస్తానని పేర్కొన్నారు. తనను చైర్మన్గా గెలిపించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మరోవైపు మున్సిపాలిటీలోని 40 వార్డులకు కూటమి కౌన్సిలర్ అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. భారీ ర్యాలీతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం కనిపించగా మార్కాపురంలో మున్సిపల్ ఎన్నికల వేడి మరింత పెరిగింది. మార్కాపురం మున్సిపల్ పీఠంపై కూటమి జెండా ఎగురవేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నారు.




