Yerragondapalem: సీఎం సహాయ నిధి అండ.. 23 కుటుంబాలకు ఆర్థిక భరోసా
Yerragondapalem: యర్రగొండపాలెం పట్టణంలో నిరుపేదలకు సీఎం సహాయ నిధి (CMRF) ద్వారా ఆర్థిక ఊరట లభించింది.
Yerragondapalem: సీఎం సహాయ నిధి అండ.. 23 కుటుంబాలకు ఆర్థిక భరోసా
మార్కాపురం జిల్లా: నిరుపేదలకు అండగా సీఎం సహాయ నిధి 23 కుటుంబాలకు రూ.11.71 లక్షల చెక్కుల పంపిణీ చేసిన.... గూడూరి ఎరిక్షన్ బాబు మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం పట్టణంలో నిరుపేదలకు సీఎం సహాయ నిధి ద్వారా ఊరట లభించింది. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 23 మంది లబ్ధిదారులకు రూ.11,71,858 విలువైన చెక్కులను యర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆపద సమయంలో ప్రజలకు ఆర్థికంగా అండగా నిలిచే సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ప్రభుత్వం అందించే ఈ సహాయం వల్ల పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ చేకూరి సుబ్బారావు, మండల టీడీపీ అధ్యక్షుడు చిట్యాల వెంగళరెడ్డి, నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




