Yerragondapalem:కాటమరాజు టెంపుల్ అభివృద్ధికి రూ.32 లక్షలు మంజూరు!

Yerragondapalem: కాటమరాజు దేవస్థానానికి రూ.32 లక్షలు మంజూరు.. జేసీబీ చొరవపై హర్షం!

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 29 Jun 2026 4:40 PM IST
Yerragondapalem
X

Yerragondapalem:కాటమరాజు టెంపుల్ అభివృద్ధికి రూ.32 లక్షలు మంజూరు!

పెద్దారవీడు: మండలంలో శ్రీ కాటమరాజు గంగాభవాని దేవస్థానం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వరుసగా అభివృద్ధి పనులు చేపడుతున్న యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు మరో కీలక ముందడుగు వేశారు.

రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్ ఎంపీ నిధుల నుంచి శ్రీ కాటమరాజు స్వామివారి దేవస్థానం ఆవరణలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.32 లక్షలు మంజూరు చేయించారు.

ఈ సందర్భంగా పెద్దారవీడు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు గూడూరి ఎరిక్షన్ బాబుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

నియోజకవర్గ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, దేవాలయాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న గూడూరి ఎరిక్షన్ బాబు సేవలను నాయకులు ప్రశంసించారు.

కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తయితే భక్తులకు, స్థానిక ప్రజలకు సామాజిక కార్యక్రమాల నిర్వహణకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మెట్టు శ్రీనివాస రెడ్డి, ఏపీ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ నక్కా శ్రీను, క్లస్టర్ ఇంచార్జి జెండా రవి, దేవస్థానం ఉపాధ్యక్షుడు గంగుల ఎల్లయ్య యాదవ్, మాజీ సర్పంచ్ ఇండ్ల రామకృష్ణారెడ్డి, సొసైటీ చైర్మన్ వెన్నా బోడి రెడ్డి, సీనియర్ నాయకులు చింతకుంట్ల సుబ్బరామిరెడ్డి, నాలి శ్రీను, వెన్నా వెంగల్ రెడ్డి,తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు ఆనకెళ్ళ శ్రీనివాస రెడ్డి, బీసీ సెల్ మండల అధ్యక్షుడు రాగల ఈశ్వర్ కుమార్, ఐటీడీపీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story