Peddaraveedu: పెద్దారవీడులో 'అనంత అరణ్య ప్లాంటేషన్'
Peddaraveedu: పెద్దారవీడు కేజీబీవీలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం.
Peddaraveedu: పెద్దారవీడులో 'అనంత అరణ్య ప్లాంటేషన్'
పెద్దారవీడు: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దారవీడు మండలం, పెద్దారవీడు గ్రామంలోని కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలలో యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు మొక్కలు నాటారు. "మన గ్రామం – మన పర్యావరణం – మన బాధ్యత" అనే నినాదంతో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.
అనంతరం జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన "నెట్ జీరో & ఆరోగ్యకరమైన క్యాంపస్" కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, అనంత అరణ్య ప్లాంటేషన్ (Ultra High Density Plantation) పథకంలో భాగంగా చేపట్టిన పిట్టింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయ ఏవో జాఫర్,ఉపాధి హామీ ఏపీవో సాంబశివరావు, అగ్రికల్చర్ ఏవో లక్ష్మీనారాయణ, వెలుగు ఏటీఎం , ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ మంత్రు నాయక్,
మండల పార్టీ టిడిపి అధ్యక్షుడు మెట్టు శ్రీనివాస రెడ్డి, టిడిపి మండల మాజీ అధ్యక్షుడు గొట్టం శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రగుంట్ల నాగేశ్వర రావు , జెడ్డా రవి, దండ వెంకటేశ్వర రెడ్డి, రోడ్డు భవనాల డైరెక్టర్ నక్క శీను, మాజీ సర్పంచులు ఆకుమళ్ళ శ్రీనివాసరెడ్డి, ఇండ్ల రామకృష్ణారెడ్డి, మండల సీనియర్ నాయకులు చింతగుంట్ల సుబ్బరామిరెడ్డి, దుగ్గెంపూడి కొండారెడ్డి, నియోజకవర్గ యువజన నాయకుడు ఆనెకార్ల శ్రీనివాసరెడ్డి, చింతగుంట్ల వెంకటేశ్వర రెడ్డి, మండల నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.




