Devarajugattu: గంగరాజు హఠాన్మరణం.. ఎర్రగొండపాలెం టిడిపికి తీరని లోటు!
Devarajugattu: ఎర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి సీనియర్ నేత గుమ్మా గంగరాజు కన్నుమూశారు. అనారోగ్యంతో గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.
Devarajugattu: గంగరాజు హఠాన్మరణం.. ఎర్రగొండపాలెం టిడిపికి తీరని లోటు!
దేవరాజుగట్టు: పెద్దారవీడు మండలం పరిధిలోని దేవరాజుగట్టు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ జెడ్పిటిసి భర్త, టిడిపి నెల్లూరు రూరల్ పరిశీలకులు గుమ్మా గంగరాజు అనారోగ్యంతో మృతి చెందారు. గత మూడు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను చికిత్స నిమిత్తం గుంటూరు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
బీసీ నాయకుడిగా, టిడిపి పార్టీ నిబద్ధత కలిగిన నాయకుడిగా, కాటంరాజు దేవస్థానం అధ్యక్షులుగా సేవలందించిన గుమ్మా గంగరాజు హఠాన్మరణం పట్ల టిడిపి శ్రేణులు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలతో మమేకమై పనిచేసే నాయకుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉండేదని స్థానిక నాయకులు తెలిపారు. గుంటూరు నుండి ఈరోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత మృతదేహాన్ని దేవరాజుగట్టు గ్రామానికి తీసుకువస్తున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
విషయం తెలుసుకున్న ఎర్రగొండపాలెం టిడిపి ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, మండల టిడిపి అధ్యక్షుడు మెట్టు శ్రీనివాసరెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు గొట్టం శ్రీనివాసులరెడ్డి, సొసైటీ చైర్మన్ రాజేశ్వరరెడ్డి, వెన్న బోడిరెడ్డి, డైరెక్టర్ నక్క శీను తదితర టిడిపి నాయకులు గంగరాజు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. “గుమ్మా గంగరాజు మరణం ఎర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి పార్టీకి తీరని లోటు” అని నాయకులు పేర్కొన్నారు.




