Markapuram: మార్కాపురం నూతన డీఎస్పీని కలిసిన టీడీపీ నేతలు!
Markapuram: మార్కాపురం నూతన డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నిమ్మగడ్డ సత్యనారాయణను టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించి అభినందించారు.
Markapuram: మార్కాపురం నూతన డీఎస్పీని కలిసిన టీడీపీ నేతలు!
Markapuram: మార్కాపురం నూతన డీఎస్పీ నిమ్మగడ్డ సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ నేతలు మార్కాపురం నూతన డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నిమ్మగడ్డ సత్యనారాయణను టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.
జిల్లా గ్రామ రెవిన్యూ అధికారుల సంఘం నాయకులు సుబ్బరామిరెడ్డి, టీడీపీ మాజీ ఎంపీపీ చందగట్ల నాగేశ్వరరావు, టీడీపీ నాయకుడు ఖాసింవలి డీఎస్పీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నూతన డీఎస్పీకి శుభాకాంక్షలు తెలిపిన వారు.. మార్కాపురం డివిజన్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని ఆకాంక్షించారు. నూతన బాధ్యతల్లో సత్యనారాయణ విజయవంతంగా రాణించాలని వారు కోరుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ నిమ్మగడ్డ సత్యనారాయణను టీడీపీ నాయకులు శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు.




