Dornala: దోర్నాల మండలం వై.చెర్లోపల్లిలో టీడీపీకి రాజీనామా కలకలం!

Dornala: దోర్నాల మండలం వై.చెర్లోపల్లిలో టీడీపీకి రాజీనామా చేసిన గ్రామ అధ్యక్షుడు బోదనపు రమణారెడ్డి. నియోజకవర్గ నాయకత్వం తీరుపై తీవ్ర అసంతృప్తి.

Srikanth Singam, Markapur
Published on: 9 Oct 2026 1:35 PM IST
Dornala
X

Dornala: దోర్నాల మండలం వై.చెర్లోపల్లిలో టీడీపీకి రాజీనామా కలకలం!

Dornala: దోర్నాల మండలం వై.చెర్లోపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. గత 40 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసినా తగిన గుర్తింపు లభించలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆ గ్రామ టీడీపీ అధ్యక్షుడు బోదనపు రమణారెడ్డి రాజీనామా ప్రకటించారు. పార్టీ సభ్యత్వంతో పాటు గ్రామ కమిటీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడేందుకు అహర్నిశలు కృషి చేసినప్పటికీ, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మండల నాయకులు, ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి తనను పట్టించుకోకుండా పక్కన పెట్టారని ఆయన ఆరోపించారు. ఈ పరిణామాలతో మనస్తాపానికి గురై పార్టీని వీడుతున్నట్లు తెలిపారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur