Chirala: చీరాల గాయత్రి స్కూల్ ఉపాధ్యాయురాలికి అప్సర నారి శక్తి అవార్డు!

Chirala: బాపట్ల జిల్లా చీరాల గాయత్రి స్కూల్ ఉపాధ్యాయురాలు చందనకు 'అప్సర నారి శక్తి 2026' అవార్డు గుంటూరులో ఘనంగా వేడుకలు.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 15 Sept 2026 7:15 PM IST
Chirala
X

Chirala: చీరాల గాయత్రి స్కూల్ ఉపాధ్యాయురాలికి అప్సర నారి శక్తి అవార్డు!

Chirala: చీరాల, టీచర్స్ హబ్ ఇండియా ఆధ్వర్యంలో హోప్ విన్ హాస్పిటల్స్ మరియు నమస్తే సలాం గుంటూరు సొసైటీ, సుభమస్తూ షాపింగ్ మాల్ సహాయ సహకారం తో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్లోబల్ ఐకానిక్ ఎడ్యుకేషనల్ అవార్డ్స్ మరియు అప్సర నారి శక్తి అవార్డ్స్ 2026 ను ఆదివారం గుంటూరు మెడికల్ కాలేజీ ఆడిటోరియం లో టీచర్స్ హబ్ ఇండియా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

గ్లోబల్ ఐకానిక్ అవార్డ్స్ లో భాగంగా ప్రధానం చేసిన అప్సర నారి శక్తి 2026 అవార్డు ను బాపట్ల జిల్లా చీరాల గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయురాలు గా గత 18 సం"లు గా అదే పాఠశాల లో విధులు నిర్వహిస్తు ఎందరో విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పి వారి బంగారు భవిష్యత్తు కు బాటలు వేసిన ఉపాధ్యాయురాలు సంఖ్యా చందన టీచర్ కు అప్సర నారి శక్తి 2026 అవార్డు ప్రధానం చేసి ఘనంగా సత్కరించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రవేటు పాఠశాల ల ఉపాధ్యాయ, ఉపాధ్యాయిని లను టీచర్స్ హబ్ ఇండియా వారు గ్లోబల్ ఐకానిక్ అవార్డ్స్ 2026,మరియు అప్సర నారి శక్తి 2026 అవార్డ్స్ ప్రధానం చేసి సత్కరించటం మరువలేనిదని, నాకు ఈ అప్సర నారి శక్తి 2026 అవార్డు రావడం చాలా సంతోషం గా ఉందని, ఈ అవార్డు ఇంకా బాధ్యతను పెంచిందని తెలిపారు.

విద్యార్థులకు విద్యా బుద్దులు నేర్పడానికి ఉపాధ్యాయులు పడే కష్టాన్ని విద్యార్థులు కూడా గుర్తించి కస్టపడి చదివి తల్లితండ్రులకు,పాఠశాలకు, ఉపాధ్యాయులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకొని వచ్చే విధంగా కృషి చేస్తే ఉన్నతమైన స్థాయిలో ఎదుగుదలకు సోపానం గా నిలుస్తుందని పిల్లలు చదువు మీద

ద్యాస పెట్టి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.సమాజం లో విలువైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని, ఒక ఉపాధ్యాయురాలుగా ఇటువంటి ప్రతిష్టాత్మకమైన అప్సర నారి శక్తి 2026 అవార్డు ను తీసుకోవడం చాలా సంతోషం గా గర్వం గా ఉందని తెలిపారు.

తల్లితండ్రులు కూడా పిల్లలు మీద ఎప్పటికప్పుడు ద్రుష్టిసారించి పర్వేక్షణ ఉంచాలని, అప్పుడప్పుడు పాఠశాలకు వచ్చి వారి ప్రోగ్రేస్ ఎలా ఉన్నది, వారి ప్రవర్తన ఎలా ఉన్నది చూస్తూ వాకబు చేస్తూ, పాఠశాల ఉపాధ్యాయులను, యాజమాన్యం వారిని అడిగి తెలుసుకోవాలని, పిల్లలు మీద ఎప్పటికప్పుడు పూర్తి పర్వేక్షన ఉంచాలని, పాఠశాల నుంచి వచ్చిన తరువాత కొంత సమయం ఆటలకు కేటాయించి మరలా విద్య మీద ద్యాస పెట్టె విధంగా తల్లితండ్రులు చూడాలని విజ్ఞప్తి చేశారు.

ఈ గ్లోబల్ ఐకానిక్ 2026,అప్సర నారి శక్తి 2026 అవార్డ్స్ కు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ మరియు ఇతర 8 రాష్ట్రల నుంచి సుమారు 1000 మంది పైగా నిస్టార్థులైన ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు ఈ అవార్డ్స్ కు ఎంపికై ప్రతిష్టాత్మక గ్లోబల్ ఐకానిక్, అప్సర నారి శక్తి 2026 అవార్డ్స్ తీసుకొనేందుకు హాజరైయారని వారి అందరి మధ్యలో విద్యావేత్తలు, ప్రముఖులు చేతులు మీదుగా అప్సర నారి శక్తి 2026 అవార్డు ను తీసుకోవడం నా జీవితంలో మరువలేనిదని సంతోషం వ్యక్తం చేశారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala