Konakanamitla: కొనకనమిట్ల ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత!
Konakanamitla: మార్కాపురం జిల్లా కొనకనమిట్ల ఎంపీడీవో కార్యాలయం వద్ద నామినేషన్ల ప్రక్రియలో ఉద్రిక్తత. నామినేషన్ పత్రాల చించివేత ఆరోపణలతో ఇరువర్గాల ఘర్షణ.
Konakanamitla: కొనకనమిట్ల ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత!
Konakanamitla: మార్కాపురం జిల్లా కొనకనమిట్ల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తువ్వపాడు, సిద్ధవరం గ్రామాలకు చెందిన అభ్యర్థుల నామినేషన్ పత్రాలను చించివేశారంటూ వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఆరోపించడంతో ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో మాటామాటా పెరిగి నామినేషన్ కేంద్రం వద్ద ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగారు.
తమ నామినేషన్ పత్రాలను చించివేశారని వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఆరోపించడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. దీంతో నామినేషన్ కేంద్రం వద్ద ఉన్న అభ్యర్థులు, కార్యకర్తలు, ఇతరులు ఆందోళనకు గురయ్యారు. కొంతసేపు అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఎంపీడీవో కార్యాలయం వద్దకు చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నామినేషన్ కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరి నుంచి వివాదం ప్రారంభమైంది అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు సమాచారం. నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగేందుకు అధికారులు, పోలీసులు చర్యలు చేపట్టారు.




