Prakasam: మార్కాపురం జిల్లాలో త్రిపురాంతకం ఎస్ఎంసీ ఎన్నిక వాయిదా!
Prakasam: మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం గొల్లపల్లి జడ్పీ హైస్కూల్లో ఎస్ఎంసీ ఎన్నికల సమయంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Prakasam: మార్కాపురం జిల్లాలో త్రిపురాంతకం ఎస్ఎంసీ ఎన్నిక వాయిదా!
Prakasam: త్రిపురాంతకం మండలం గొల్లపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నిక సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల ప్రక్రియలో భాగంగా పాఠశాల ఆవరణలోకి వైసీపీ, టీడీపీ వర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు రావడంతో కొంతసేపు అలజడి చోటుచేసుకుంది.
పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు ఇరు వర్గాలకు చెందిన వారిని పాఠశాల ఆవరణ నుంచి బయటకు పంపించారు. ఇరు వర్గాలు ఎస్ఎంసీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాఠశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ నెల 29న జరగాల్సిన ఎస్ఎంసీ ఎన్నికకు అవసరమైన కోరం లేకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. దీంతో పాఠశాల ఎస్ఎంసీ ఎన్నికలు అసెంబ్లీ, స్థానిక ఎన్నికలను తలపించేలా సాగుతున్నాయని స్థానికంగా చర్చ జరుగుతోంది.
ఎన్నికల నేపథ్యంలో ఇరు వర్గాలకు చెందిన వారు పాఠశాల ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై మోహరించడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న సీఐ హసాన్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.




