Santanutalapadu: గంగవరంలో ఉద్రిక్తత: శ్మశానంలో అంత్యక్రియలకు అధికారుల బ్రేక్

Santanutalapadu: సంతనూతలపాడు మండలం గంగవరంలో పురాతన శ్మశానంలో అంత్యక్రియలను అధికారులు అడ్డుకోవడంతో మృతదేహంతో మాదిగ కులస్తులు ఆందోళనకు దిగారు.

G.V. Naresh Kumar, Prakasam
Published on: 22 Sept 2026 3:10 PM IST
Santanutalapadu
X

Santanutalapadu: గంగవరంలో ఉద్రిక్తత: శ్మశానంలో అంత్యక్రియలకు అధికారుల బ్రేక్

సంతనూతలపాడు: సంతనూతలపాడు మండలం గంగవరం గ్రామంలో పురాతన కాలం నాటి శ్మశానవాటికలో అంత్యక్రియలకు అధికారుల అడ్డంకి -మృతదేహంతో మాదిగ కులస్తుల నిరసన.

ప్రైవేట్ వ్యక్తుల భూమిలో అంత్యక్రియలు నిర్వహించేందుకు వీల్లేదంటూ పోలీసులు, రెవెన్యూ అధికారులు అడ్డుకోవడంతో సంతనూతలపాడు మండలం గంగవరం గ్రామంలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది.

తరతరాలుగా శ్మశానవాటికగా వినియోగిస్తున్న స్థలంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు అధికారులు అడ్డుకోవడంపై మాదిగ కులస్తులు తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు.

గంగవరం ఎస్సీ కాలనీకి చెందిన గుడిపూడి సుబ్బారావు (65) మంగళవారం మృతి చెందారు.

G.V. Naresh Kumar, Prakasam

G.V. Naresh Kumar, Prakasam