Ponnaluru: పొన్నలూరులో ఎంపీటీసీ నామినేషన్ల వేళ తీవ్ర ఉద్రిక్తత!

Ponnaluru: ప్రకాశం జిల్లా పొన్నలూరులో ఎంపీటీసీ నామినేషన్ల వేళ తీవ్ర ఉద్రిక్తత. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు. ఇరువర్గాల బాహాబాహీతో ఉత్కంఠ.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 22 Oct 2026 12:59 PM IST
Ponnaluru
X

Ponnaluru: పొన్నలూరులో ఎంపీటీసీ నామినేషన్ల వేళ తీవ్ర ఉద్రిక్తత!

Ponnaluru: కొండేపి నియోజకవర్గంలోని పొన్నలూరులో ఎంపీటీసీ నామినేషన్ల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అభ్యర్థులతో కలిసి నామినేషన్ దాఖలు చేసేందుకు వస్తున్న మాజీ మంత్రి, వైసీపీ నేత ఆదిమూలపు సురేష్‌ను టీడీపీ నాయకులు అడ్డుకోవడంతో ఇరు పార్టీల కార్యకర్తలు రోడ్డుపై బాహాబాహీకి దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అభ్యర్థులతో కలిసి నామినేషన్ వేసేందుకు అనుమతించాలని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ డీఎస్పీని చేతులెత్తి వేడుకున్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, నిన్నటి నుంచి వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు, ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పొన్నలూరులో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్