Markapur: పుల్లలచెరువు ఎంపీడీవో కార్యాలయం వద్ద టీడీపీ, వైసీపీ శ్రేణుల ఘర్షణ!

Markapur: మార్కాపురం జిల్లా పుల్లలచెరువు ఎంపీడీవో ఆఫీస్ వద్ద టీడీపీ-వైసీపీ శ్రేణుల ఘర్షణ. నామినేషన్ పత్రాల చించివేత, పరిస్థితులను అదుపు చేసేందుకు పోలీసు లాఠీఛార్జ్.

Srikanth Singam, Markapur
Published on: 21 Oct 2026 5:41 PM IST
Markapur
X

Markapur: పుల్లలచెరువు ఎంపీడీవో కార్యాలయం వద్ద టీడీపీ, వైసీపీ శ్రేణుల ఘర్షణ!

Markapur: మార్కాపురం జిల్లా పుల్లలచెరువుమండల కేంద్రంలోని కార్యాలయం వద్ద నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు వస్తుండగా, అక్కడే ఉన్న టీడీపీ శ్రేణులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం మొదలైంది. ఈ క్రమంలో వైసీపీ నేతల నామినేషన్ పత్రాలను చించివేసినట్లు ఆరోపణలు రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి, పరస్పరం దాడులకు దిగినట్లు సమాచారం. పరిస్థితి అదుపుతప్పడంతో అక్కడే బందోబస్తులో ఉన్న పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలపై లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు. ఘటనతో పుల్లలచెరువు మండల కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur