Santhanuthalapadu: సంతనూతలపాడు గురవారెడ్డిపాలెంలో పోలింగ్ ఉద్రిక్తత!
Santhanuthalapadu: ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం గురవారెడ్డిపాలెంలో ఎస్సై రిగ్గింగ్‌కు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ గ్రామస్తుల ఓటింగ్ బహిష్కరణ, ఎస్సై నిర్బంధం.
Santhanuthalapadu: సంతనూతలపాడు గురవారెడ్డిపాలెంలో పోలింగ్ ఉద్రిక్తత!
Santhanuthalapadu: సంతనూతలపాడు మండలం గురవారెడ్డిపాలెంలో ఎన్నికల పోలింగ్ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. జడ్పీటీసీ అభ్యర్థికి అనుకూలంగా రిగ్గింగ్ చేసేందుకు ఎస్సై సహకరించే ప్రయత్నం చేశారంటూ గ్రామస్తులు ఆరోపణలు చేయడంతో వివాదం మొదలైంది. ఎస్సై జోక్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు పోలింగ్‌లో పాల్గొనేందుకు నిరాకరించారు.
తమకు న్యాయం జరిగే వరకు ఓటింగ్ నిర్వహించేందుకు అంగీకరించబోమని గ్రామస్తులు స్పష్టం చేసినట్లు సమాచారం. ఎన్నికల ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఎస్సైని గ్రామస్తులు నిర్బంధించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసు అధికారి వ్యవహారశైలిపై గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల్లో పోలీసుల జోక్యం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు గ్రామంలో చోటుచేసుకున్న పరిణామాలతో ఎన్నికల పోలింగ్ ప్రక్రియపై అనిశ్చితి నెలకొంది.




