Kanigiri: వైఎస్ఆర్‌సీపీ పోలింగ్ ఏజెంట్ల అదుపుపై కలకలం!
Kanigiri: మార్కాపురం జిల్లా హనుమంతునిపాడు మండలం తిమ్మారెడ్డిపల్లిలో జెడ్పీటీసీ పోలింగ్ వేళ వైఎస్ఆర్‌సీపీకి చెందిన ముగ్గురు ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Kanigiri: వైఎస్ఆర్‌సీపీ పోలింగ్ ఏజెంట్ల అదుపుపై కలకలం!
Kanigiri: జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మార్కాపురం జిల్లాలోని హనుమంతునిపాడు మండలం తిమ్మారెడ్డిపల్లిలో పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు పోలింగ్ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే వాసికి చెందిన ఏజెంట్లను పోలీస్టేషన్ కు తరలించారని ఆరోపణలు ఉన్నాయి.
అంతే కాకుండా రెండు మూడు రోజుల క్రితం ఏజంట్లకు పోలీసులు ఫోన్లు చేసి ఏజెంట్లుగా ఉండ కూడదు అని చెప్పినట్లుగా కూడా పలువురు ఏజెంట్లు చెబుతున్నారు. అయితే, ముగ్గురు పోలింగ్ ఏజెంట్లను అదుపులోకి తీసుకోవడానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.




