Cheemakurthi: కూనంనేనివారి పాలెంలో పోలేరమ్మ గుడిలో చోరీ!
Cheemakurthi: ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం కూనంనేనివారి పాలెంలోని పోలేరమ్మ తల్లి గుడిలో గుర్తుతెలియని దుండగులు మెయిన్ గేటు బద్దలు కొట్టి హుండీలోని నగదు అపహరించారు.
Cheemakurthi: కూనంనేనివారి పాలెంలో పోలేరమ్మ గుడిలో చోరీ!
Cheemakurthi: ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం కూనం నేనివారి పాలెం లోని పోలేరమ్మ తల్లి గుడిలో 17వ తారీకు మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు మెయిన్ గేటు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి గుడికి సంబంధించిన కానుకల హుండీని పగలగొట్టి అందులోని నగదు అపహరించారు.
గుడి వాచ్మెన్ సమాచారం మేరకు విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెళ్లి చూడగా హుండీ ధ్వంసం అయింది. స్థానిక చీమకుర్తి పోలీసులకు సమాచారం ఇవ్వగా విషయం తెలుసుకున్న సిబ్బంది సంఘటన స్థలాన్ని చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




