Podili: పొదిలిలో పొగాకు రైతుల రాస్తారోకో.. ట్రాఫిక్‌లో ఎస్పీ!

Podili: పొగాకు గిట్టుబాటు ధర కోసం ఒంగోలు-కర్నూలు జాతీయ రహదారిపై పొదిలి రైతులు రాస్తారోకో చేశారు ఈ క్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎస్పీ ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు.

MADARVALI, MARKAPURAM
Published on: 6 July 2026 12:42 PM IST
Podili
X

Podili: పొదిలిలో పొగాకు రైతుల రాస్తారోకో.. ట్రాఫిక్‌లో ఎస్పీ!

పొదిలి: పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటు రైతులు మళ్ళి రొడ్డెక్కారు, ప్రతి రొజు గిట్టుబాటుధర కొసం రైతులు రొడ్డెక్కడం,ధర్నా చేయడం,నిరసనవ్యక్తం చేయడం పరిపాటిగా మారింది, ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపొతే రైతులు తీవ్రంగా నష్టపొతారని ఆందొళన వ్యక్తం చేస్తున్నారు.

మార్కాపురంజిల్లా పొదిలి పొగాకువేలం కేంద్రం నిలుపుదల చేసి ఒంగొలు,కర్నూలు జాతీయ రహదారి పై బైటాయించి రైతులు నిరసన వ్యక్తం చేశారు, రొడ్డుపై నిరసనవ్యక్తం చేయడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపొయింది, ట్రాఫిక్ లో ఉమ్మడి ప్రకాశంజిల్లా ఎస్పి చిక్కుకొవడంతో పొలీసులు వెంటనే అప్రమత్తమై రైతులను రాస్తారొకొ విరమింపజేసి, ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. అనంతరం ఎస్పి రైతుల నిరసన గురించి తెలుసుకొని పొలీసులకు తగు సూచనలు ఇచ్చారు.

ప్రభుత్వం తక్షణమే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని క్వింటాకు రూ 20 వేలు తగ్గకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం దాదాపు 75 శాతం నొబిడ్ పొగాకు పండిందని ప్రభుత్వం రైతులను ఆదుకొవాలని రైతులు కొరారు. వేలం ప్రారంభంలో 400 బేళ్ళు రాగా 20 బేళ్ళు గిట్టుబాటుధర రాకపొవడంతో ఆందొళన చేపట్టారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని రైతులు కొరుతున్నారు.

MADARVALI, MARKAPURAM

MADARVALI, MARKAPURAM

Next Story