Tripurantakam: విశ్వనాథపురంలో టీడీపీ, వైసీపీ ఘర్షణ.. పలువురికి గాయాలు
Tripurantakam: త్రిపురాంతకం మండలం విశ్వనాథపురంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య రాళ్లు, కర్రలతో ఘర్షణ; పలువురికి గాయాలు, భవనం ధ్వంసం, పోలీసుల జోక్యంతో అదుపులోకి.
Tripurantakam: విశ్వనాథపురంలో టీడీపీ, వైసీపీ ఘర్షణ.. పలువురికి గాయాలు
త్రిపురాంతకం: మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం విశ్వనాథపురం గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కోడి విషయంలో మొదలైన చిన్న వివాదం కాస్తా ఇరువర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీకి చెందిన ఏడుకొండలు, వైసీపీకి చెందిన రంగబాబు వర్గాల మధ్య ఈ గొడవ జరిగింది.
టీడీపీకి చెందిన కోడిని వైసీపీకి చెందిన ట్రాక్టర్ తొక్కిందనే విషయంపై ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగింది. దీంతో ఒకరిపై ఒకరు కారం చల్లుకోవడంతో పాటు రాళ్లు, కర్రలతో దాడులకు దిగినారు ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఘర్షణలో ఓ భవనం అద్దాలు, ఎలివేషన్ కూడా ధ్వంసమయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే విశ్వనాథపురం గ్రామానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. చిన్నపాటి వివాదం రాజకీయ వర్గాల మధ్య ఘర్షణగా మారడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.




