Peddaraveedu: దైవ భక్తి చాటిన యూకే ప్రముఖ డెంటిస్ట్ కర్ర రమణారెడ్డి దంపతులు

Peddaraveedu: మార్కాపురం జిల్లా బి.చెర్లోపల్లె గ్రామంలో యూకే డెంటిస్ట్ కర్ర రమణారెడ్డి దంపతుల ఆధ్యాత్మిక సేవ.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 8 Jun 2026 12:58 PM IST
Peddaraveedu
X

Peddaraveedu: దైవ భక్తి చాటిన యూకే ప్రముఖ డెంటిస్ట్ కర్ర రమణారెడ్డి దంపతులు

మార్కాపురం జిల్లా: సొంత గ్రామంపై ప్రేమ, దైవ భక్తికి నిదర్శనంగా యూకేలో స్థిరపడిన ప్రముఖ డెంటిస్ట్ దంపతులు డాక్టర్ కర్ర రమణారెడ్డి, డాక్టర్ సుజితా రెడ్డి వారి కుమార్తె అదితి రెడ్డి పెద్దారవీడు మండలం బి.చెర్లోపల్లె గ్రామంలోని ఎస్సీ పాలెం ప్రజల చిరకాల కోరికను నెరవేర్చారు. తమ సొంత నిధులతో శ్రీరాముడు, సీతమ్మవారు, లక్ష్మణస్వామి , ఆంజనేయ స్వామి విగ్రహాలను అందజేసి గ్రామస్థుల ప్రశంసలు అందుకున్నారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు దాతలను ఘనంగా సన్మానించి భారీ ఊరేగింపుతో స్వాగతం పలికారు. అనంతరం రామ, సీత, లక్ష్మణ , ఆంజనేయ స్వామి విగ్రహాలను గ్రామంలోని సచివాలయం సమీపానికి భక్తిశ్రద్ధలతో తీసుకువెళ్లారు.

గ్రామాభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా తమ వంతు సహకారం అందించడం అభినందనీయమని మాజీ ఎంపీటీసీ మూల రమాదేవి, కర్ర శ్రీనివాసులరెడ్డి, కర్ర శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్నప్పటికీ స్వగ్రామ అభ్యున్నతికి కట్టుబడి సేవా కార్యక్రమాలు చేపడుతున్న కర్ర రమణారెడ్డి దంపతులను గ్రామ ప్రజలు ప్రత్యేకంగా అభినందించారు. "సంపాదించిన సంపదలో కొంత భాగాన్ని స్వగ్రామ అభివృద్ధికి, దైవ సేవకు వినియోగించడం నిజమైన సమాజ సేవ" అని గ్రామ పెద్దలు కొనియాడారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story