Kanigiri: కనిగిరిలో అంగరంగ వైభవంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ

Kanigiri: మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ ఘనంగా ఆవిష్కరించారు.

Showry Doas, Staff Reporter -Ongole
Published on: 6 Jun 2026 3:56 PM IST
Kanigiri
X

Kanigiri: కనిగిరిలో అంగరంగ వైభవంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ

కనిగిరి: మార్కాపురం జిల్లాలోని కనిగిరి పట్టణంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని కేంద్ర ఆహార శుద్ధి, పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ అంగరంగ వైభవంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో ప్రజలు, ప్రజాప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

విగ్రహావిష్కరణ అనంతరం కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ పట్ల తనకున్న గౌరవాన్ని చాటుతూ విగ్రహం ముందు మోకాళ్లపై కూర్చొని నమస్కరించి నివాళులర్పించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ దృశ్యం అక్కడున్న వారిని భావోద్వేగానికి గురి చేసింది.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి భావితరాలకు ఆదర్శమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, హోం మంత్రి వంగలపూడి అనిత, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Showry Doas, Staff Reporter -Ongole

Showry Doas, Staff Reporter -Ongole

రెండు దశాబ్దాలకు చేరువగా (16 ఏళ్లు) క్షేత్రస్థాయి అనుభవంతో, ఒంగోలు మరియు ప్రకాశం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story