Singarayakonda: పాకల సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన బోటు!

Singarayakonda: పాకల సముద్ర తీరానికి ఓ బోటు కొట్టుకురావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తుఫాను సమయంలో కొట్టుకుపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.

Ram Mohan, Singarayakonda
Published on: 14 Nov 2026 11:13 AM IST
Singarayakonda
X

Singarayakonda: పాకల సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన బోటు!

Singarayakonda: సింగరాయకొండ మండలం పాకల సముద్ర తీరానికి ఓ బోటు కొట్టుకొచ్చింది. తీరానికి చేరిన బోటులో ఎవరూ లేకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బోటులో చేపల వలలు కూడా కనిపించలేదు.

ఇటీవల తుఫాను సమయంలో సముద్రంలోకి కొట్టుకుపోయిన బోట్లలో ఇది ఒకటి అయి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ బోటు తూర్పుగోదావరి జిల్లాకు చెందినదై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

అయితే బోటు ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చింది? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. బోటు మూలాలు, యజమాని వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Ram Mohan, Singarayakonda

Ram Mohan, Singarayakonda