Darsi: దర్శి జడ్పీటీసీగా వరికూటి నాగరాజు లక్ష్మీ తయారు ఘన విజయం
Darsi: దర్శి మండల జడ్పీటీసీగా జనసేన పార్టీ అభ్యర్థిని వరికూటి నాగరాజు లక్ష్మీ తయారు 21,401 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించడంతో నేతలు ఘనంగా సత్కరించారు.
Darsi: దర్శి జడ్పీటీసీగా వరికూటి నాగరాజు లక్ష్మీ తయారు ఘన విజయం
ప్రకాశం జిల్లా: దర్శి మండల జడ్పీటీసీ సభ్యురాలిగా జనసేన పార్టీ తరఫున పోటీ చేసి 21,401 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన వరికూటి నాగరాజు లక్ష్మీ తయారును జనసేన పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నివాసానికి వెళ్లిన జనసేన పార్టీ నాయకులు హల్చల్ జహీర్, నాగార్జున, మదర్ వలి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో ఘనంగా సత్కరించారు. జడ్పీటీసీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రజలు జనసేన పార్టీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మండల అభివృద్ధికి కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజల ఆదరాభిమానాలను పొందాలని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.




