Singarakonda: సింగరకొండలో వైభవంగా సీతారాముల వసంతోత్సవం

Singarakonda: ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ సీతారాముల ఉత్సవ మూర్తులకు వసంతోత్సవం నిర్వహించారు.

Kolla Singaiah, Addanki
Published on: 13 May 2026 7:29 PM IST
Singarakonda
X

Singarakonda: సింగరకొండలో వైభవంగా సీతారాముల వసంతోత్సవం

Singarakonda: ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నందు శ్రీ సీతారాముల ఉత్సవ మూర్తులకు పసుపు గంధం పన్నీరు కస్తూరి పచ్చ కర్పూరం వంటి సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి వసంతోత్సవం వైభవంగా జరిపించారు అనంతరం హనుమాన్ జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని ప్రసన్నాంజనేయ స్వామికి మామిడిపండ్లతో విశేష అర్చన మహనివేదన పంచ హారతులు ను ఆలయ అర్చకులు నిర్వహించారు స్వామివారిని దర్శనార్థం వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ ఈవో తిమ్మనాయుడు పాలకమండలి చైర్మన్ మురళి సుధాకర్, ఉభయ దాతలు , ట్రస్ట్ బోర్డ్ సభ్యులు పాల్గొన్నారు.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki

Next Story