Veligonda: వెలిగొండ ప్రాజెక్టులో యంత్రం తొలగింపు పనులు వేగవంతం

Veligonda: వెలిగొండ ప్రాజెక్టు రెండవ సొరంగం తవ్వకం పూర్తి కావడంతో భారీ టన్నెల్ బోరింగ్ మెషిన్ (టీబీఎం) తొలగింపు పనులను అధికారులు వేగవంతం చేశారు.

Srikanth Singam, Markapur
Published on: 25 Jun 2026 10:03 AM IST
Veligonda
X

Veligonda: వెలిగొండ ప్రాజెక్టులో యంత్రం తొలగింపు పనులు వేగవంతం

Veligonda: మార్కాపురం జిల్లా వెలిగొండ ప్రాజెక్టులో టన్నెల్ బోరింగ్ మెషిన్ (టీబీఎం) తొలగింపు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సొరంగం తవ్వకాలలో కీలక పాత్ర పోషించిన ఈ భారీ యంత్రాన్ని విడిభాగాలుగా విడదీసి బయటకు తరలించే ప్రక్రియను అధికారులు చేపట్టారు.

భారీ క్రేన్ల సహాయంతో యంత్రంలోని వివిధ భాగాలను జాగ్రత్తగా తొలగిస్తూ సాంకేతిక నిపుణులు పనులు నిర్వహిస్తున్నారు. భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.

వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన దశను పూర్తి చేసిన టీబీఎంను తొలగించడం ద్వారా తదుపరి పనులకు మార్గం సుగమం అవుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న యంత్రం తొలగింపు పనులు ప్రాజెక్టు ప్రాంతంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur

Next Story