Veligonda: వెలుగొండ సొరంగాల్లోకి కృష్ణా జలాలు!

Veligonda: మార్కాపురం జిల్లా వెలుగొండ ప్రాజెక్ట్ జంట సొరంగాల్లోకి కృష్ణా జలాలు; విజయవంతమైన ట్రయల్ రన్, రేపు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా లాంఛన ప్రారంభం.

Srikanth Singam, Markapur
Published on: 30 Aug 2026 11:41 AM IST
Veligonda
X

Veligonda: వెలుగొండ సొరంగాల్లోకి కృష్ణా జలాలు!

Veligonda: శ్రీశైలం వద్ద గల కొల్లం వాగు నుంచి హెడ్‌ రెగ్యులేటర్‌ గేట్లను 6 అంగుళాల మేర ఎత్తడంతో కృష్ణా జలాలు వెలుగొండ ప్రాజెక్టు జంట సొరంగాల్లోకి ప్రవహిస్తున్నాయి. ట్రయల్‌ రన్‌లో భాగంగా అధికారులు గేట్లను ఎత్తి నీటిని సొరంగాల్లోకి విడుదల చేశారు.

జంట సొరంగాల ద్వారా ప్రవహిస్తున్న కృష్ణా జలాలు కృష్ణాజిల్లా పరిధిలోని ఫీడర్‌ కెనాల్‌లోకి ప్రవేశించే సమయంలో ప్రాజెక్టు అధికారులు సైరన్‌ మోగించి తొలి హెచ్చరికను జారీ చేశారు. దీంతో వెలుగొండ ప్రాజెక్టు ట్రయల్‌ రన్‌ ప్రక్రియలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.

కృష్ణా జలాలు ఫీడర్‌ కెనాల్‌లోకి చేరడంతో వెలుగొండ ప్రాజెక్టు ద్వారా సాగు, తాగునీటి ప్రయోజనాలు అందించే దిశగా మరో ముందడుగు పడింది. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జలహారతి కార్యక్రమం నిర్వహించి ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur

Next Story