Santanutalapadu: బాలికల భవిష్యత్తు కోసం కిషోర్ వికాసం ఎంఈఓ వెంకా రెడ్డి

Santanutalapadu: సంతనూతలపాడు మండల పరిషత్ కార్యాలయంలో ఎంఈఓ వెంకా రెడ్డి ఆధ్వర్యంలో 'కిషోర్ వికాసం' సమీక్ష.

G.V. Naresh Kumar, Prakasam
Published on: 9 May 2026 5:08 PM IST
Santanutalapadu
X

Santanutalapadu: బాలికల భవిష్యత్తు కోసం కిషోర్ వికాసం ఎంఈఓ వెంకా రెడ్డి

సంతనూతలపాడు: సంతనూతలపాడు మండల పరిషత్ కార్యాలయంలో శనివారం నాడు ఎంఈఓ. డి. వెంకా రెడ్డి పర్యవేక్షణలో కిషోర్ వికాసం వేసవి సెలవుల శిక్షణ తరగతులు కార్యక్రమం ఫై మండల స్థాయి అధికారులు, పలు రంగాల సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. కిషోర్ బాలికలు చెడు ప్రవర్తనకు దూరంగా మంచి పరివర్తనతో ఎలా ముందుకు కొనసాగాలంటూ ప్రొటెక్టర్ ద్వారా ఎంఈఓ.వెంకా రెడ్డి వివరించారు.

కిషోర్ బాలికలు ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా సమాజంలో బాగా చదివి మంచి ప్రవర్తన ద్వారా ఉన్నత స్థాయికి ఎదిగేందుకు వారిని అందరూ చైతన్య పరచాలని ఎంఈఓ. వెంకా రెడ్డి కోరారు. కిషోర్ బాలికలు ఆరోగ్య సంరక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత, విద్యాభివృద్ధి, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. ముఖ్యంగా గ్రామ కమిటీలు, వీరిని మరింతగా చైతన్య పరచాలన్నారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో అరుణ కుమారి, ఐసిడిఎస్.సూపర్వైజర్.డి. సావిత్రి, వెలుగు సిసి శ్రీనివాసులు, సిహెచ్ఓ. మాధవరావు, అంగన్వాడీ టీచర్లు, సచివాలయం సిబ్బంది, వీఆర్వోలు, పంచాయతీ అభివృద్ధి అధికారులు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొనారు.

G.V. Naresh Kumar, Prakasam

G.V. Naresh Kumar, Prakasam

Next Story