Chirala: చీరాలలో యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఆధునిక వైద్య సేవలు!
Chirala: బాపట్ల జిల్లా చీరాలలో యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నెలలో 1, 3 గురువారాల్లో ఆధునిక వైద్య సేవలు అందిస్తామని డాక్టర్ జగదీష్ తెలిపారు.
Chirala: చీరాలలో యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఆధునిక వైద్య సేవలు!
Chirala: మారుతున్న ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గడం, యాంత్రిక జీవనశైలి కారణంగా ఊబకాయం, ఫ్యాటీ లివర్ వంటి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని ప్రముఖ వైద్య నిపుణుడు జగదీష్ పోలవరపు తెలిపారు. మద్యం సేవించే వారిలోనే కాకుండా, మద్యం అలవాటు లేని వారిలోనూ అధిక బరువు, మధుమేహం, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వంటి కారణాలతో కాలేయ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ వ్యాధులు ప్రారంభ దశలో స్పష్టమైన లక్షణాలు చూపకపోవడంతో చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారని, సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రమాదాన్ని గుర్తించవచ్చని సూచించారు.
చీరాలలోని సరస్వతి గ్యాస్ట్రో అండ్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఊబకాయాన్ని కేవలం బరువు సమస్యగా కాకుండా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యగా పరిగణించాలని అన్నారు. పొట్ట చుట్టూ అధిక కొవ్వు పేరుకుపోవడం వల్ల మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులతో పాటు కాలేయ సమస్యల ముప్పు పెరుగుతుందని వివరించారు. సోషల్ మీడియాలో ప్రచారమయ్యే అశాస్త్రీయ డైట్ ప్లాన్లు, వైద్యుల సలహా లేకుండా వినియోగించే మందులు ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఫ్యాటీ లివర్ సమస్యను గుర్తించేందుకు వైద్యుల సూచన మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని, కొన్ని సందర్భాల్లో ఫైబ్రోస్కాన్ వంటి ఆధునిక పరీక్షలు కాలేయంలో కొవ్వు నిల్వలు, ఫైబ్రోసిస్ స్థాయిని అంచనా వేయడానికి ఉపయోగపడతాయని తెలిపారు. ఆహార నియంత్రణ, క్రమం తప్పని వ్యాయామం, బరువు తగ్గడం, మధుమేహ నియంత్రణ ద్వారా వ్యాధి ముప్పును తగ్గించుకోవచ్చని సూచించారు.
ఊబకాయం సమస్యతో బాధపడుతున్న ఎంపిక చేసిన రోగులకు కడుపుపై కోతలు లేకుండా నోటి ద్వారా ఎండోస్కోప్ను పంపి కడుపు పరిమాణాన్ని తగ్గించే ఎండోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీ (ఈఎస్జీ) విధానం అందుబాటులో ఉందని జగదీష్ పోలవరపు వివరించారు. రోగి ఆరోగ్య పరిస్థితి, అవసరాలను బట్టి ఈ విధానం అనుకూలతను వైద్యులు నిర్ణయిస్తారని తెలిపారు.
హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో చీరాల ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రతి నెలా ఒకటో, మూడో గురువారాల్లో చీరాలలో ప్రత్యేక వైద్య సేవలకు అందుబాటులో ఉంటానని వెల్లడించారు. ఈ సమావేశంలో యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ అసిస్టెంట్ మేనేజర్ ఖాసిం వాలి పాల్గొన్నారు.




