Yerragondapalem: మద్యం మత్తులో సెల్ టవర్ ఎక్కిన యువకుడు
Yerragondapalem: మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ ఆవరణలోని సెల్ టవర్ ఎక్కి ఒక యువకుడు మద్యం మత్తులో రెండు గంటల పాటు హల్చల్ చేశాడు.
Yerragondapalem: మద్యం మత్తులో సెల్ టవర్ ఎక్కిన యువకుడు
Yerragondapalem: మార్కాపురం జిల్లా .యర్రగొండపాలెం పట్టణంలోని తిరుమలగిరి కాలనీకి చెందిన (చెంచు) హనుమంతు 25. అనే యువకుడు ఎర్రగొండపాలెం పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఉన్న సెల్ టవర్ ఎక్కి రెండు గంటల పాటు హల్చల్ చేశాడు. అక్కడే ఉండి విన్యాసాలు చేస్తూ పోలీసులను అగ్నిమాపక శాఖ సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశాడు.
అతని తాలూకు బంధువులు పోలీసులు అతనికి నచ్చజెప్పడంతో యువకుడు క్రిందకి దిగి వచ్చాడు. నీకు ఏమి కావాలి అని ఎస్సై దేవకుమార్ ఆ యువకుడిని అడుగుగా అతడు నాకు మద్యం కావాలి ఇప్పించండి సార్ అంటూ బదులిచ్చాడు. ఆ యువకుడు అప్పటికే అధికంగా మద్యం మత్తులో ఉండడంతో 108 వాహనం ద్వారా స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Next Story




