Yerragondapalem: గిరిజన పాఠశాలల్లో ఐటీడీఏ పీవో నాయుడు ఆకస్మిక తనిఖీ
Yerragondapalem: ఎర్రగొండపాలెం మండలం తిరుమలగిరి చెంచు కాలనీలోని జీపీఎస్, మినీ గురుకుల పాఠశాలలను ఐటీడీఏ పీవో పి.వి.ఎస్. నాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Yerragondapalem: గిరిజన పాఠశాలల్లో ఐటీడీఏ పీవో నాయుడు ఆకస్మిక తనిఖీ
Yerragondapalem: ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పి.వి.ఎస్. నాయుడు ఎర్రగొండపాలెం మండలంలోని తిరుమలగిరి చెంచు కాలనీలో గల జీపీఎస్ పాఠశాల, మినీ గురుకుల పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, వారి విద్యాభ్యాసం, పాఠశాల వాతావరణంపై ఆరా తీశారు.
పాఠశాలలలో తరగతి గదులు, వంటగది, తాగునీటి సదుపాయాలు, ఇతర మౌలిక వసతులను పరిశీలించారు. ముఖ్యంగా విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, పరిశుభ్రత, భోజన నాణ్యతపై అధికారులకు పలు సూచనలు చేశారు.
మినీ గురుకుల పాఠశాలలో ఇటీవల గిరిజన సంక్షేమ శాఖ అందించిన ఆర్వో ప్లాంట్ పనితీరును పరిశీలించి, విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం తిరుమలగిరి చెంచు కాలనీలో పర్యటించిన ప్రాజెక్టు అధికారి గ్రామస్తుల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
గిరిజన ప్రాంతాల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందేలా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని ప్రాజెక్టు అధికారి పి.వి.ఎస్. నాయుడు తెలిపారు.




