Yerragondapalem: 18కి 18 ఎంపీటీసీలు క్లీన్ స్వీప్ చేసిన టీడీపీ!

Yerragondapalem: ఎర్రగొండపాలెం మండలంలో 18 ఎంపీటీసీ స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకున్న టీడీపీ. ఎంపీపీ పీఠం దక్కడంతో బాణాసంచా పేల్చి వేడుక చేసుకున్న శ్రేణులు.

Srikanth Singam, Markapur
Published on: 27 Oct 2026 6:08 PM IST
Yerragondapalem
X

Yerragondapalem: 18కి 18 ఎంపీటీసీలు క్లీన్ స్వీప్ చేసిన టీడీపీ!

ఎర్రగొండపాలెం: మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చాటింది. నియోజకవర్గ పరిధిలోని 18 ఎంపీటీసీ స్థానాలకు గాను 18 స్థానాలను తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా దక్కించుకోవడంతో పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఈ విజయంతో ఎంపీపీ పదవి కూడా తెలుగుదేశం పార్టీకి దక్కనుంది.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగడం, అభ్యర్థుల ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరించడం పార్టీకి కలిసివచ్చిన అంశాలుగా పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. 18 ఎంపీటీసీ స్థానాలనూ ఏకగ్రీవంగా సాధించడం పార్టీకి రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ విజయంతో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తూ విజయాన్ని వేడుకగా జరుపుకుంటున్నారు. ఎంపీపీ పదవిని దక్కించుకునే అవకాశం లభించడంతో మండల స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేసేందుకు అవకాశం ఏర్పడిందని పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

18కు 18 ఎంపీటీసీ స్థానాలను ఏకగ్రీవంగా సాధించడం ద్వారా ఎర్రగొండపాలెంలో తెలుగుదేశం పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుందని టీడీపీ నాయకులు బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్న ఎర్రగొండపాలెం టిడిపి శ్రేణులు

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur