Yerragondapalem: ఎర్రగొండపాలెం సీటు తాటిపర్తికే ఇవ్వాలి.. మాజీ ఎమ్మెల్యే

Yerragondapalem: ఆశావాహులు ఎంతమంది ఉన్నా ప్రజాదరణ కలిగిన తాటిపర్తి మాత్రమే ఇక్కడ గెలుపు గుర్రమని, ఆయనకే టికెట్ ఇవ్వాలని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 18 Jun 2026 4:16 PM IST
Yerragondapalem
X

Yerragondapalem: ఎర్రగొండపాలెం సీటు తాటిపర్తికే ఇవ్వాలి.. మాజీ ఎమ్మెల్యే

Yerragondapalem: మార్కాపురం జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎర్రగొండపాలెం నియోజకవర్గ టికెట్ విషయంలో సీనియర్ రాజకీయ కురవృద్ధుడు, మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. "ఆశావాహులు ఎంతమంది ఉన్నా, ప్రజల్లో బలమైన ఆదరణ కలిగిన తాటిపర్తి మాత్రమే గెలుపు గుర్రం. ఎర్రగొండపాలెం సీటు తాటిపర్తికే దక్కాలి" అని ఆయన స్పష్టం చేశారు.

తాటిపర్తి నాయకత్వం, ప్రజలతో ఆయనకు ఉన్న అనుబంధం, నియోజకవర్గ అభివృద్ధిపై చూపుతున్న చొరవ కారణంగానే ఆయనకు ప్రజల్లో విశేష ఆదరణ ఉందని కొండారెడ్డి పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ తాటిపర్తికి అవకాశం కల్పిస్తే భారీ మెజారిటీతో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

కొండారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఎర్రగొండపాలెం రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీయగా, పార్టీ కేడర్లో ఉత్సాహం రేకెత్తిస్తున్నాయి.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story