Prakasham: చంద్రబాబు వెన్నుపోటుపై పెద్దారవీడులో వైస్సార్సీపీ నిరసన

Prakasham: కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై యర్రగొండపాలెం ఎమ్మెల్యే పిలుపు మేరకు పెద్దారవీడు మండల కేంద్రంలో వైస్సార్సీపీ 'వెన్నుపోటుకు రెండేళ్లు' నిరసన ప్రదర్శన.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 4 Jun 2026 4:07 PM IST
Prakasham
X

Prakasham: చంద్రబాబు వెన్నుపోటుపై పెద్దారవీడులో వైస్సార్సీపీ నిరసన

Prakasham: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు యర్రగొండపాలెం నియోజకవర్గ శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ గారి పిలుపుతో మండల కన్వీనర్ పాలిరెడ్డి కృష్ణారెడ్డి సారధ్యంలో పెద్దారవీడు మండల కేంద్రంలో "చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.

కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యానికి చేసిన వెన్నుపోటును నిరసిస్తూ నిర్వహించిన ఈ ప్రజా చైతన్య కార్యక్రమంలో వైసిపి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరి వెంకట నారాయణ రెడ్డి, నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షుడు ఒద్దుల లక్ష్మిరెడ్డి, మాజీ డీలర్ లు మెట్టు భాస్కర్ రెడ్డి, అల్లు వెంకటేశ్వర రెడ్డి, వెన్న పోలిరెడ్డి, కంచర్ల .కేశవయ్య మాజీ సర్పంచ్ కంచర్ల సుబ్బయ్య, మండల సీనియర్ నాయకులు బద్విటి కేసయ్య, కాసు వెంకటరెడ్డి, గురవయ్య మండలానికి చెందిన వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, సుబ్బారెడ్డి, మాడుగుల వెంకటేశ్వర రెడ్డి, మూడమంచు వెంకట కొండయ్య, పులి సుబ్బయ్య,, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story