Addanki: ముస్లిం సోదరుల నిర్ణయం భారతదేశానికే గర్వకారణం.. వైసీపీ

Addanki: వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ కొనియాడారు.

Kolla Singaiah, Addanki
Published on: 28 May 2026 8:13 PM IST
Addanki
X

Addanki: ముస్లిం సోదరుల నిర్ణయం భారతదేశానికే గర్వకారణం.. వైసీపీ

అద్దంకి: ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణం దేశంలో మత సామరస్యాన్ని చాటేలా ముస్లిం సోదరులు తీసుకున్న నిర్ణయం అత్యంత అభినందనీయమని, ఇది భారతదేశానికే గర్వకారణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త అశోక్ కుమార్ కొనియాడారు. స్థానిక అద్దంకి వైసీపీ పార్టీ కార్యాలయంలో ముస్లిం ప్రతినిధులు, సోదరులు అశోక్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముందుగా ముస్లిం సోదరులందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రస్తుత రోజుల్లో కొందరు స్వార్థపరులు మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో, ముస్లిం సమాజం తీసుకున్న నిర్ణయం సమాజానికి గొప్ప సందేశాన్ని ఇస్తోందని అన్నారు. హిందువులు పవిత్రంగా భావించే గోవును వధించకూడదని, అంతేకాకుండా ఆవును 'జాతీయ జంతువు'గా ప్రకటించాలని ముస్లిం సోదరులు కోరడం వారి విశాల హృదయానికి నిదర్శనమన్నారు. ముస్లిం సోదరులు కులమతాలకు అతీతంగా అందరూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవించినప్పుడే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని డాక్టర్ అశోక్ కుమార్ స్పష్టం చేశారు.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki

Next Story