Prakasam: కూటమి ప్రభుత్వం మోసపూరిత మాటలను ప్రజలెవరూ నమ్మరు: అశోక్ కుమార్

Prakasam: ప్రకాశం జిల్లా అద్దంకి వైఎస్సార్సీపీ ఇన్‌చార్జ్ చింతలపూడి అశోక్ కుమార్ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

Kolla Singaiah, Addanki
Published on: 17 May 2026 7:29 PM IST
Prakasam
X

Prakasam: కూటమి ప్రభుత్వం మోసపూరిత మాటలను ప్రజలెవరూ నమ్మరు: అశోక్ కుమార్

Prakasam: ప్రకాశం జిల్లా అద్దంకి వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ చింతలపూడి అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చెబుతున్నమోసపూరిత మాటలను,ఇస్తున్న హామీలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమాత్రం నమ్మే పరిస్థితిలో లేరన్నారు. చంద్రబాబు పబ్లిక్ మీటింగ్‌లలో చేస్తున్న వ్యాఖ్యల పై ఘాటుగా స్పందించారు.ఇటీవల చంద్రబాబు మాట్లాడుతూ 'మూడో బిడ్డను కంటే రూ. 30 వేలు, నాలుగో బిడ్డను కంటే రూ. 40 వేలు ఇస్తాం' అనడాన్ని అశోక్ కుమార్ తప్పుపట్టారు. "బాబు మాటలను ఎలా నమ్మాలి?" అని రాష్ట్రంలో ఒక పెద్ద వర్గం ప్రశ్నిస్తోందన్నారు.

ఎన్నికల ముందు రూ. 5 వేల జీతం తీసుకునే వాలంటీర్లకు రూ. 10 వేలు ఇస్తామని నమ్మించి, మోసం చేశారన్నారు ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ. 1,500 ఇస్తామని చెప్పి ఆశ పెట్టారు. ఎక్కువ మంది పిల్లల్ని కనాలని చెప్పే హక్కు కేవలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంటి నాయకుడికే ఉంటుందని స్పష్టం చేశారు.నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి, విద్యావ్యవస్థను సంపూర్ణంగా ప్రక్షాళన చేసింది జగన్ గారే. విద్య, వైద్య వ్యవస్థలను పూర్తిగా చావబేటిక మీద పెట్టినట్లు చేసిన చంద్రబాబును ప్రజలు ఎలా నమ్ముతారు?"ప్రశ్నించారు.

చంద్రబాబు పై కేవలం ప్రజల్లోనే కాకుండా, కూటమి నాయకుల భాగస్వాముల్లో కూడా నమ్మకం సన్నగిల్లిందన్నారు. "కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ సైతం మిమ్మల్ని నమ్మక, 'జై అమరావతి' అనకుండా 'జై ఆంధ్ర' అనే నినాదాన్ని అందుకున్నారంటే.. ఈ రెండేళ్లలో నే మీపై నమ్మకం ఏ స్థాయికి పడిపోయిందో ఒకసారి ఆలోచించుకోండి బాబు గారు" అంటూ చింతలపూడి అశోక్ కుమార్ హితవు పలికారు.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki

Next Story