Kanigiri: కనిగిరిలో మౌలాబి, తౌషిక్ కుటుంబాన్ని పరామర్శించిన నాయకులు!

Kanigiri: మార్కాపురం జిల్లా కనిగిరిలో మౌలాబి, తౌషిక్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్.

Guravayya, Kanigiri
Published on: 18 Sept 2026 1:58 PM IST
Kanigiri
X

Kanigiri: కనిగిరిలో మౌలాబి, తౌషిక్ కుటుంబాన్ని పరామర్శించిన నాయకులు!

Kanigiri: మార్కాపురం జిల్లా కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని 9 వ వార్డుకు చెందిన సయ్యద్ మౌలాబి, తౌషిక్ కుటుంబాన్ని శుక్రవారం పార్టీ శ్రేణులతో కలిసి కనిగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ పరామర్శించారు. ఈ సందర్భంగా అలీ కి సంఘీభావం తెలిపి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

మౌలాబి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధించినట్లు ఆయన తెలిపారు.ఈ సందర్భంగా దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థి తౌషిక్ అనుమానాస్పద మృతి,న్యాయం జరగక అతని తల్లి మౌలాబీ బలవన్మరణానికి పాల్పడిన ఘటనలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను వెలుగులోకి తేవాలని డిమాండ్ చేశారు.

తల్లి, తనయుడు మృతి వెనుక ఉన్న వాస్తవాలు, ఒత్తిళ్ళు,కుట్ర కోణాలను నిగ్గు తేల్చాల్సిందేనని పేర్కొన్నారు.దోషులను కఠినంగా శిక్షించడంతో పాటు బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.

ఈ ఘటనను పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షులు, దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దృష్టికి మరొకసారి తీసుకువెళ్తానని,అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా న్యాయ పోరాటం చేస్తామని అలీ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని దద్దాల నారాయణ యాదవ్ భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో షేక్ అబ్దుల్ గఫార్,మడతల కస్తూరి రెడ్డి,సూరసాని మోహన్ రెడ్డి,కటికల వెంకటరత్నం, గాండ్లపర్తి ఆదినారాయణ రెడ్డి,డాక్టర్ షేక్ నాయబ్ రసూల్, రాచపూడి మాణిక్యరావు, గూడూరి అబ్రహం లింకన్,సిరుప గోవర్ధన్ రెడ్డి,ఆవుల భాస్కర్ రెడ్డి ,అయిమల్ల నాగమణి, షేక్ నజీబ్, షేక్ రెహమాన్, యర్రబెల్లి దేవరాజ్, సిగా కృష్ణారావు, పిల్లి లక్ష్మీనారాయణ రెడ్డి, చింతకుంట్ల కిషోర్ బాబు, షేక్ రెహమాన్ ,షేక్ నాగూర్ బి, షేక్ ఖాదర్ జిలాని, షేక్ షకీల, సయ్యద్ నాయబ్ రసూల్, పోలక సిద్ధారెడ్డి,దాదిదిరెడ్డి మాలకొండ రెడ్డి, బచ్చు వెంగళరావు గుప్త, పలుకూరీ భాస్కర్,ఇండ్ల భాను, మద్దిశెట్టి భారతి తదితరులు.

Guravayya, Kanigiri

Guravayya, Kanigiri