Podili: పొదిలిలో వైఎస్సార్సీపీ నిరసన
Podili: కూటమి ప్రభుత్వం ప్రజలను వెన్నుపోటు పొడిచిందని మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జ్ అన్నా రాంబాబు మండిపడ్డారు.
Podili: పొదిలిలో వైఎస్సార్సీపీ నిరసన
Podili: ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలుగా ప్రజలను వెన్నుపొటు పొడుస్తున్న అధికార పార్టి వ్యతిరేకంగా వెన్నుపొటు దినోత్సవం నిర్వహిస్తున్నట్లు మార్కాపురం నియోజకవర్గ వైసిపి ఇన్ చార్జి అన్నారాంబాబు అన్నారు.
మార్కాపురంజిల్లా పొదిలి పెద్ద బస్టాండ్ సెంటర్లో టిడిపి ఎన్నికల మ్యాన్ పెస్టొ ప్రతులను వైసిపి కార్యకర్తలు తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. అన్నరాంబాబు మాట్లాడుతు ప్రజలకు సూపర్ సిక్స్ హమీలు అమలు చేయడంలో ప్రభుత్వం తీవ్ర విఫలమైందని ప్రజలను వెన్నుపొడవటమే లక్ష్యంగా అధికార పార్టీ ప్రవర్తిస్తుందని దుయ్యబట్టారు.
తొలుత వైఎస్సాఆర్ విగ్రహనికి పూలమాలు వేసి నివాళులు ఆర్పించి అనంతరం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రేస్ పార్టి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పటికైనా అధికార పార్టి స్పందించి ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.




