Markapuram: వెలుగొండ నిర్వాసితులకు వైఎస్సార్‌సీపీ అండ – ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలి

Markapuram: వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ, ఇంటి పట్టాలు వెంటనే అందించాలని చంద్రశేఖర్, అన్నా రాంబాబు డిమాండ్.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 24 Aug 2026 4:13 PM IST
Markapuram
X

Markapuram: వెలుగొండ నిర్వాసితులకు వైఎస్సార్‌సీపీ అండ – ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలి

మార్కాపురం: వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలైన సుంకేసుల, కన్నోతల, గుండంచెర్ల గ్రామాల నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మార్కాపురం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జి అన్నా రాంబాబు స్పష్టం చేశారు.

నిర్వాసితులకు రావాల్సిన పెండింగ్ ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీని వెంటనే అందించాలని, పునరావాస కాలనీల్లో తాగునీరు, రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక వసతులు పూర్తిస్థాయిలో కల్పించాలని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి నిర్వాసితుడికి తక్షణమే ఇంటి పట్టాలు మంజూరు చేయాలని జిల్లా అధికారులను కోరారు.

ముంపు గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం పోరాడతామని తెలిపారు. వెలుగొండ నిర్వాసితులకు పూర్తి న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగిస్తుందని నేతలు హామీ ఇచ్చారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story