Podili: సుదనగుంట ఎంపీటీసీలో వైఎస్సార్‌సీపీ విజయం: శ్రావణి గెలుపు

Podili: మార్కాపురం జిల్లా పొదిలి మండలం సుదనగుంట ఎంపీటీసీ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దొండపాటి శ్రావణి రీకౌంటింగ్‌లోనూ 43 ఓట్ల మెజార్టీతో గెలుచుకున్నారు.

MADARVALI, MARKAPURAM
Published on: 7 Nov 2026 3:30 PM IST
Podili
X

Podili: సుదనగుంట ఎంపీటీసీలో వైఎస్సార్‌సీపీ విజయం: శ్రావణి గెలుపు

మార్కాపురం జిల్లా: పొదిలి మండల పరిధిలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో సుదనగుంట స్థానాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. వైసీపీ అభ్యర్థి దొండపాటి శ్రావణి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై విజయం సాధించారు.

పొదిలి మండలంలో మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, వాటిలో ఎనిమిది స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన రెండు స్థానాలైన సుదనగుంట, మల్లవరం గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించారు. ఇందులో భాగంగా సుదనగుంట ఎంపీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి దొండపాటి శ్రావణికి 1017 ఓట్లు రాగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 973 ఓట్లు వచ్చాయి. బీసీవై పార్టీకి 2 ఓట్లు, నోటాకు 1 ఓటు నమోదయ్యాయి. అదేవిధంగా 16 ఓట్లు చెల్లనివిగా అధికారులు గుర్తించారు.

మొదట ప్రకటించిన ఫలితాల్లో దొండపాటి శ్రావణి 44 ఓట్ల మెజార్టీతో విజయం సాధించినట్లు వెల్లడైంది. అయితే టీడీపీ అభ్యర్థి రీకౌంటింగ్‌కు అభ్యర్థించడంతో అధికారులు మరోసారి ఓట్ల లెక్కింపు చేపట్టారు. రీకౌంటింగ్ అనంతరం కూడా వైసీపీ అభ్యర్థి దొండపాటి శ్రావణి 43 ఓట్ల మెజార్టీతో విజయం సాధించినట్లు తేలింది.

రీకౌంటింగ్ అనంతరం కూడా తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుని శ్రావణి విజయం సాధించడంతో వైసీపీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమైంది.

MADARVALI, MARKAPURAM

MADARVALI, MARKAPURAM